భుదందాలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే తగిన చర్యలు తప్పవు : రాజేష్ చంద్ర IPS



 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:భద్రాచలం ఏఎస్పీ, కొత్తగూడెం ఇన్ ఛార్జ్ డి.ఎస్.పి రాజేష్ చంద్ర శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కడైనా భూ దందాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తీసుకొని కఠిన శిక్షలు పడే విధంగా చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇటీవల జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బండి సత్యనారాయణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెండ్యాల వీర వెంకట సత్య జగన్ మహేశ్వరరావు, బాణోత్ కిషన్ అను వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని, ఇట్టి కేసు విచారణ దశలో ఉన్న  సమయంలో కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుందని, ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినా భూ దందాలకు పాల్పడినా, రైతుల వద్ద నుండి భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేసిన  అట్టి వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post