రైతు చట్టం చారిత్రాత్మకం... బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర


 

రైతు రక్షణ, సంక్షేమం అభివృద్ధి కోసం దేశంలో మొదటిసారి భారత వ్యవసాయ రంగంలో నవ శకానికి నాంది పలుకుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మకమైన రైతు చట్టాన్ని తీసుకు వచ్చారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర తెలిపారు.. రైతు చట్టంపై పై  విపక్షాలు అనవసర ఆరోపణలు ,రాద్ధాంతం చేస్తున్న దృష్ట్యా రైతులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి సూచన మేరకు చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆదివారం అలుగునూర్ లో జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ఆధ్వర్యంలో రైతులకు కరపత్రాలను పంపిణీ చేసి   వాస్తవాలను వివరించడం జరిగింది. .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంక్షల చట్రంలో చిక్కుకుపోయిన రైతుకు  దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ధర నిర్ణయించుకునే స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చారిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకో వచ్చిందన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా భారతీయ రైతులకు మాత్రం నిజమైన స్వాతంత్రం26 సెప్టెంబర్2020 న వచ్చిందన్నారు. రైతు చట్టం ముఖ్య ఉద్దేశం రైతుల ఆదాయాన్ని రెట్టింపు  చేయడమే అని తెలిపారు.. ఆ దిశగా కేంద్రంలో కి అధికారం లోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత ఆరేళ్లలో కనీస మద్దతు ధరలను గణనీయంగా పెంచింది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నిత్యం నానా ఇబ్బందులు పడుతూ పేదరికంలోనే ఉంటున్నాడని,.. దీనికి ముఖ్య కారణం రైతు పై ఆంక్షలు, పరిమితులు విధించడం  అని అన్నారు.. రైతు పై ఆంక్షలు పరిమితులు  ఎత్తివేసిన చట్టమే  నూతన వ్యవసాయ చట్టం అని రైతును కేవలం  ఓటుబ్యాంకుగా చూసిన పార్టీలు రైతు శ్రేయస్సు కోసం నేటికి ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా నేడు తెచ్చిన చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ చట్టంలో రైతు భద్రత కోసం రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టారని, ఇప్పటివరకు  పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేదని  దళారులు, అధికారులు, మార్కెట్ యార్డ్ లో తిష్ట వేసిన రాజకీయ నిరుద్యోగులు కుమ్మక్కై ధర్నా నిర్వహించే వారిని దీంతో రైతులు చాలా నష్టపోయాడు అని  తెలిపారు. నేటి చట్టంతో చెమటోడ్చి పండించిన పంటకు ధర నిర్ణయించేది రైతే నని పేర్కొన్నారు.. ముఖ్యంగా ఇప్పటివరకు రైతు దగ్గరలోని కొనుగోలు కేంద్రాల్లో మార్కెట్ యార్డ్ లోనే మాత్రమే పంటను అమ్ముకోవాలి, కానీ నేడు రైతు  తాను పండించిన పంటకు అధిక ధర ఎక్కడ లభిస్తే   అక్కడ అమ్ముకోవచ్చని తెలిపారు.. అంతేకాకుండా ఇప్పటి వరకు పంటను రైతు అమ్ముకోవాలి అంటే రైతు సెస్సు, పన్నులు, మార్కెట్ ఫీజు కట్టాల్సి వచ్చేదని ఇప్పుడు చట్టం తో ఎలాంటి రుసుము చెల్లించకుండా, అనుమతులు తీసుకోకుండా దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్చని పేర్కొన్నారు.. ఇప్పటివరకూ వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందుబాటులో ఉండేది కాదని ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అందించే సాంకేతిక పరిజ్ఞానంతో రైతు తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలసాయం పొందే అవకాశం ఉందని అన్నారు. ఇన్నేళ్లుగా రైతుకు ఎలాంటి రక్షణ లేదని, పంట అమ్మిన తరువాత ఎప్పుడు డబ్బులు చేతికి అందుతాయో తెలియని పరిస్థితి అని, నేడు ఈ చట్టంతో ఆ పరిస్థితి మారిందని అన్నారు. రైతు పంటను అమ్మిన మూడు రోజుల్లోనే కొనుగోలు దారుడు డబ్బులు చెల్లించాలని లేకపోతే జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.. ఏదైనా వివాదం తలెత్తితే రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఈ చట్టం తో రైతు కొనుగోలుదారు మధ్య ఏవి వాదమైనా తలెత్తితే రైతు ఉన్న ప్రాంతంలోనే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ 30 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అప్పటికి తెలియకుంటే  కలెక్టర్ సమస్య పరిష్కరిస్తారని ఆయన  వివరించారు .లోగడ రైతే కొనుగోలుదారు దగ్గరకు వెళ్లాల్సి వచ్చేదని, నేడు కార్పొరేట్ కంపెనీ లే గ్రామాలకు వచ్చి పంటను కొనుక్కుంటా యని దీంతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామీణ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.. రైతు కొనుగోలు  దారుడికి మధ్య ఒప్పందం కేవలం పంటపై మాత్రమేనని.. విపక్షాలు గిట్టని వాళ్ళు చేస్తున్నట్టు భూమిపై కాదని ఆయన స్పష్టం చేశారు.. ఏ విధంగా చూసినా ఇంతవరకు ఉన్నట్టు రైతుల రక్షణ ,సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం అంటూ లేదని, దేశంలో మొదటి సారి రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో   ప్రధానమంత్రి నరేంద్రమోడీ  ప్రత్యేక చట్టం తీసుకు వచ్చారని తెలిపారు.. బిజెపి ప్రభుత్వం చేపట్టిన ప్రతి చర్యను విమర్శించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ టిఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ చట్టంపై అవాస్తవాలను ప్రచారం లో పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రతిపక్షాల విమర్శలు లెక్కచేయకుండా జై కిసాన్ ..జై జవాన్  నినాదాన్ని ఆచరణలో పెడుతూ భారతదేశాన్ని విశ్వ గురువు గా నిలవాలని 130 కోట్ల భారతీయులకు ప్రగతి ఫలాలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. రైతుల శ్రేయస్సు కోసం తీసుకువచ్చినా  చట్టం పై ఇప్పటికైనా ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు మానుకొని చారిత్రకమైన ఈ చట్టానికి మద్దతు తెలిపి ప్రధాని మోడీ కి దేశ ప్రజలంతా అండగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు..

0/Post a Comment/Comments

Previous Post Next Post