భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి రానున్న మూడు రోజులు బారి నుండి అతి బారి వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో పరిస్థితులును చక్కదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి ఆదేశాలు జారీచేశారు. తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రవహించే వాగులు వంకలు దాటొద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. పాడుబడిన భవనాలు, పెద్ద పెద్ద చెట్లు, వంగిన, విరుగిన, లూజు విద్యుత్తు తీగల వల్ల ప్రమాదం ఉందని ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ఏదేని సమస్య ఏర్పడితే ప్రజలు అధికారుల దృష్టికి తేవాలని, వచ్చిన సమస్యను అధికారులు తక్షణం పరిష్కరించాలని చెప్పారు. చేపట్టిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించను న్నందున అదికారులు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి.
Post a Comment