నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి - బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి

 


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్: ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వివిధ రకాల పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని  తిమ్మాపూర్ మండల బిజెపి అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో వరి కర్రలతో,ప్లకార్డులు చేతబట్టుకొని ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఎల్ఎండి పోలీసులు బందోబస్తు నిర్వహించి పర్యవేక్షణ జరిపారు ధర్నా కార్యక్రమానంతరం  జగదీశ్వరాచారి మాట్లాడుతూ వర్షాల వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఈ సమయంలో ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని అన్నారు.రైతులకు సరియైన నష్టపరిహారం అందించిన తర్వాత రైతు వేదికల నిర్మాణాలపై ద్రుష్టి పెట్టండని ప్రజాప్రతినిధులకు సూచించారు.మండలంలో సుమారు 2000 ఎకరాల్లో వరి పంట,800 ఎకరాల్లో పత్తిపంటలు నష్టపోయినట్లుగా రైతుల ద్వారా సమాచారం అందిందని తెలిపారు.కాగా నష్టం వాటిల్లిన వరి పంటకు ఎకరాను రూ.40 వేలు,పత్తికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.రైతులు పండించిన మక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ భీమా యోజన కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.రైతులకు నష్టం చేసే ప్రభుత్వాలకు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.అనంతరం రైతుల సమస్యలను ప్రభుత్వ ద్రుష్టికి తీసుకెళ్లాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ పడిగెల రాజ్ కుమార్ కి వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా అధ్యక్షులు కంది రాజేందర్ రెడ్డి,కిసాన్ మోర్చా కౌన్సిల్ మెంబర్ తమ్మిశెట్టి మల్లయ్య,ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనీల్,గొట్టిముక్కుల తిరుపతి రెడ్డి,ఉపాధ్యక్షులు తమ్మనవేణి రాజు యాదవ్,సీనియర్ నాయకులు బూట్ల శ్రీనివాస్,మావురపు సంపత్,తాళ్లపెళ్లి రాజు గౌడ్,సిరికొండ మాధవరావు, ఓబీసీ మోర్చా దుర్సేటి రమేష్,కందుకూరి సాయి కృష్ణ,శాబోలు గణేష్,గొల్లపెళ్లి రమేష్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post