కరీంనగర్ జిల్లా: రైతు వేదిక భవనాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఆరోపించారు. రామడుగు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదిక భవనం సజ్జ కుప్పకూలిపోగా మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలసి సందర్శించారు. నిర్మాణంలో ఉన్న రైతు వేదిక సజ్జ కూలిపోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి కాంట్రాక్టర్‌తోపాటు కార్మికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం జోజిరెడ్డి మాట్లాడుతూ రైతు వేదిక భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, ఇందుకు కూలిన రామడుగు రైతు వేదిక సజ్జీ నిదర్శనమని పేర్కొన్నారు. పని వేళలో కూలితే పాణ నష్టం జరిగి ఉండేదన్నారు. రాత్రి 11 గంటల వరకూ హడావుడిగా పనులు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నాసిరకం పనులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్ద న్నారు. సజ్జ కూలడానికి బాధ్యులపై చర్య తీసుకోవాలని జోజిరెడ్డి డిమాండ్చే శారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ఈ భవనాలు నిర్మిస్తున్నదే తప్ప టీఆర్ఎస్డ బ్బుతో కాదని, నాసిరకం పనులతో భవనాలు కూలిపోయేలా నిర్మించి ప్రజాధనం వృధా చేయొద్దన్నారు. మండల కేంద్రాల్లో కొనసాగుతున్న రైతు వేదిక భవన నిర్మాణాల నాణ్యతను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తనిఖీలు చేపట్టాలని ఆయన కోరారు. జోజిరెడ్డి వెంట రామడుగు మండల పార్టీ అధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్,పార్టీ నాయకులు కోర గట్టయ్య, జవ్వాజి కాంతయ్య, వెంకటేశ్ గౌడ్,మనోజ్ తదితరులు ఉన్నారు.
Post a Comment