కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ పోలీసులు క్షమాపణలు చెప్పారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ఈ నెల 3న సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక బయలుదేరారు.ఈ క్రమంలో నోయిడా ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల బారి నుంచి కార్యకర్తలను రక్షించేందుకు ప్రియాంక పరుగున వెళ్లారు. దీనిని గమనించిన ఓ పోలీసు ప్రియాంక కుర్తా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రియాంక కింద పడబోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. ప్రియాంకపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై మహిళా పోలీసు అధికారితో దర్యాప్తు జరిపించనున్నట్టు చెప్పారు. మహిళల భద్రత, వారి గౌరవానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
Post a Comment