గుండ్లపల్లి రాజీవ్ రహదారి పై ధర్నా చేసిన బీజేపీ నాయకులు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి రాజీవ్  రహదారి పై దిగ్బంధం చేసి ధర్నా నిర్వహిస్తున్న మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నగునూరి శంకర్, నిన్నటి రోజున సిద్దిపేట కు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ పోలీసు బలగాలతో అడ్డుకొని ఆ కారణంగా ఎంపీ పై చేయి వేసి అరెస్టు చేసి బలవంతంగా ఎంపీ ని కరీంనగర్  తీసుకెళ్లాడని సిపి తీరును  నిరసిస్తూ గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో మండల భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ రహదారి దిగ్బంధం  చేసి సిద్దిపేట సిపి ని తక్షణమే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు నియంతృత్వ ధోరణితో నిరంకుశ పాలనతో రాష్ట్ర బిజెపి నాయకులను కార్యకర్తలను. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి దుబ్బాక ఎన్నికల్లో దొంగ చాటుగా గెలవాలని పోలీస్ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్న నీ దుర్మాగా చర్యలను దుబ్బాక ప్రజలు గమనిస్తున్నారు నీకు నీ నియంత ప్రభుత్వనికి తగిన బుద్ది చెప్తారని మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ హెచ్చరించారు ఈకార్యక్రమంలో జంగపల్లి ఎంపీటీసీ అట్టికం రాజేశం గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు కూన మహేష్, బిజెపి మండల  నాయకులు హరికాంతం అనిల్ రెడ్డి,రాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post