కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా నాగెల్లి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో యూనియన్ సమావేశం నిర్వహించారు ప్రధాన కార్యదర్శిగా ఇరుకుల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బొట్టు శ్రీనివాస్,ఎలుక రాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగెల్లి ఆంజనేయులు మాట్లాడుతూ యూనియన్ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష్య , ప్రధాన కార్యదర్శి లకు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మరెడ్డి,రామగిరి విష్ణుమూర్తి, యూనియన్ సభ్యులు కోరెపు అనిల్, తూముల శ్రీనివాస్, తిరుపతి పాల్గొన్నారు.
Post a Comment