కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఆదేశాల మేరకు గన్నేరువరం మండలంలోని గన్నేరువరం ఆరోగ్య ఉప కేంద్రం - గునుకుల కొండాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాలలో బుధవారం కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరము నిర్వహించారు ఈ శిబిరంలో గన్నేరువరం గ్రామంలోని 56 మంది కి కరోనా వ్యాధి పరీక్షలు నిర్వహించగా అందులో 13 మందికి కరోనా వ్యాధి పాజిటివ్ గా నిర్ధారణ అయింది అదేవిధంగా గునుకుల కొండాపూర్ గ్రామంలోని కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను 45 మందికి చేయగా ఎవరికీ వ్యాధి ఉన్నట్టు రాలేదని వైద్యు అధికారి డాక్టర్ ఇందు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యశిబిరం కరీంనగర్ కరోనా వ్యాధి మొబైల్ టీం సూపర్ వైజర్ వి సంపత్ రెడ్డి,ల్యాబ్ టెక్నీషియన్ ప్రకాష్, వైద్య సిబ్బంది శ్రీనివాస్, రమేష్ కుమార్, అనిత, రాధా, సునీత, వివిధ గ్రామాల్లోని ఆశ వర్కర్లు పాల్గొన్నారు
Post a Comment