బెజ్జంకి తాసిల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు ధర్నా


 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ వద్దు మరియు డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బెజ్జంకి మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది బిజెపి మండల అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ LRS ను పూర్తిగా రద్దు చేయాలి అలాగే అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎల్ఆర్ఎస్ విధానం అనేది నయా రజాకర్ విధించిన పన్ను లా ఉన్నది, ప్రభుత్వం చేసిన రిజిస్ట్రేన్లకు ఇప్పుడు LRS విధించడం ఏంటి అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న LRS కడుతే అక్రమాలన్ని సక్రమంగా మరుతాయా? ఈ విధానం కేవలం ప్రభుత్వానికి ఖాజన నింపడానికి తప్ప ప్రజలకు ఏవిధమైన ఉపయోగం లేదు కావున LRS వెంటనే రద్దు పరచాలని బిజెపి మండల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండల తహశీల్దారు కి వినతి పత్రం ను అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు దొంతరవేని శ్రీనివాస్,సంగ రవి,బందిపల్లి సత్యనారాయణ, కచ్చు సంపత్, కచ్చు ముత్తయ్య, గైని రాజు, వడ్లూరు సాయిలు తూము ల రమేష్ బొప్పనఅజయ్, గంప రవి గుప్త, వడ్లూరు శ్రీనివాస్, కొత్తపేట రామచంద్రమం, తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post