అయోధ్యలో ఒక్కసారిగా పెరిగిన భూముల ధరలు - రంగంలోకి దిగిపోయిన బడాబాబులు

 


కరోనా కారణంగా దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం కుదేలైంది. అద్దె ఇళ్లు పెరిగిపోయాయి. కొత్తగా ఇళ్లు కొనేవాళ్లు ఎవరూ లేకుండా పోయారు. కానీ, ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య ప్రాంతంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. అయోధ్యలో రామాలయానికి శంకుస్థాపన జరిగి దాదాపు నెల రోజులు అవుతుండగా, ఇక్కడ స్థిరాస్థి ధరలు ఆకాశానికి తాకుతున్నాయి.అయోధ్యలో నెల రోజుల వ్యవధిలోనే భూముల ధరలు 30 నుంచి 40 శాతం వరకూ పెరిగాయి. నగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన తరువాత, పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, బడాబాబులు, ఇక్కడ భూములు కొనేందుకు పరుగులు పెడుతూ వచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం, స్టార్ హోటళ్లతో పాటు, పలు నిర్మాణాలకు అయోధ్యలో అనుమతి ఇస్తున్నామని ఆదిత్యనాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పలువురు రియల్టర్లు అయోధ్య ప్రాంతంలో వాలిపోయారు. అందుబాటులో ఉన్న భూములన్నీ కొనుగోలు చేస్తూ, నిర్మాణాలు ప్రారంభించే ప్రయత్నాల్లో నిర్మాణ రంగ కంపెనీలు ఉన్నాయి. అయోధ్యలో అలయం నిర్మితమైతే, భారీగా భక్తులు వస్తారన్న ఆలోచనతోనే ఇక్కడి భూములను సొంతం చేసుకునేందుకు బడాబాబులు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది.


0/Post a Comment/Comments

Previous Post Next Post