కరోనా దృష్ట్యా వారాంతపు సంతను స్వచ్చందంగా మానుకోండి మండలంలో కరోనాను తగ్గించండి - ఎంపీడీఓ నారాయణ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం: చర్ల మండల తహశీల్దారుకి కరోనా సోకిన నేపధ్యంలో మండల పరిపాలన బాధ్యతలో ప్రథమ భూమిక పోషిస్తున్న మండల  ఎంపీడీఓ నారాయణ.  కరోనా వైరస్ మండలంలో సామాజిక వ్యాప్తి నేపథ్యంలో  ప్రజా ప్రయోజనార్థం  ప్రతి ఆదివారం మండల కేంద్రంలో మెజర్ పంచాయితీ పరిధిలో   నిర్వహించు చిల్లర దుకాణదారులు స్వచ్చందంగా బంద్ చేసుకొని లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, మరియు రోజువారి  దుకాణ సముదాయముల వారు స్వచ్చందంగా ఉదయం 6 గంటల నుండి  మధ్యాహ్నం 2 గంటలకు వరకు మాత్రమే  దుకాణములు నిర్వహించి లాక్ డౌన్ కి సహకరించగలరాని మండల ప్రజలను కోరారు. నిత్యవసర వస్తవుల కోసం మండల కేంద్రంకి వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా  మాస్క్ ధరించాలని,  ధరించని వారి కి 1000 రూపాయలు జరిమానా విధించవలసిందిగా మేజర్ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post