పలు గ్రామాల్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా - జిల్లా కలెక్టర్ శశాంక - జిల్లాస్థాయి అధికారుల విస్తృత పర్యటన



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని  గుండ్లపల్లి, జంగపల్లి, మాదాపూర్, గ్రామాల్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్ శశాంక,జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, జిల్లాస్థాయి అధికారులతో  కలిసి పర్యటించారు గుండ్లపల్లి లో స్మశాన వాటిక పనులను పరిశీలించి ప్రకృతి వనంలో మొక్కలు నాటారు కంపోస్ట్ షేడ్ ను పరిశీలించారు అనంతరం గుండ్లపల్లి లోనర్సరీని పరిశీలించారు స్మశాన వాటిక నిర్మాణం నర్సరీ నిర్వహణ పై సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డిని అభినందించారు.

మాదాపూర్ గ్రామంలో మొక్కలు నాటి అనంతరం  నూతనంగా నిర్మించిన వారసంత ను పరిశీలించి రైతు కల్లాల నిర్మాణాలను పరిశీలించారు  కల్లాల పై అభిప్రాయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రైతు వేదిక నిర్మాణాలను పరిశీలించారు అనంతరం జంగపల్లి లోని ప్రకృతి వనంలో మొక్కలు నాటారు ఈకార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post