ఈరోజు 27 వ డివిజన్లోని పాపయ్యపేట్, కబరిస్తాన్ రంగంపేట మసీదులలో వరంగల్ అర్బన్ రూరల్ డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మరియు గ్రేటర్ వరంగల్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కట్ల శ్రీనివాస్ గారి ఆదేశాలమేరకు కోవిడ్ వ్యాధి విస్తృతం గా ప్రభళించే క్రమంలో శుక్రవారం సందర్భంగా మసీదులో నమాజ్ చదవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని రాష్ట్ర మైనార్టీ అధ్యక్షునీ సూచనల మేరకు ఈరోజు మసీదులలో దగ్గరుండి హైడ్రో క్లోరోక్వీన్ ద్రావణాన్ని పిచికారి చేయించిన యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యదర్శి మహమ్మద్ జమీర్ ఉద్దీన్ ఈ సందర్భంగా మహమ్మద్ జమీర్ ఉద్దీన్ మాట్లాడుతూ భక్తులందరూ నమాజ్ చేసే సందర్భంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిస్టెన్స్ పాటిస్తూ నమాజ్ చేసుకోవాల్సిందిగా ఇంటి నుండి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావలసిందిగా వ్యక్తిగత శుభ్రతను పాటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రేటర్ వరంగల్ సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సయ్యద్ అజ్గర్ అలీ, మసీద్ అధ్యక్షుడు ఇస్మాయిల్ గారు, మైనారిటీ నాయకుడు సయ్యద్ అలీం ,మహమ్మద్ అక్రమ్, సయ్యద్ద్ చాంద్, తదితరులు పాల్గొన్నారు