చైనా యాప్స్ బ్యాన్ ... అసలు ఏమి జరిగింది ???



సరిహద్దుల్లో భారత సైనికులపై చైనా జవాన్లు దాడికి దిగిన తరువాత, చైనాపై పగ తీర్చుకోవాల్సిందేనంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిన వేళ, కేంద్రం డిజిటల్ స్ట్రయిక్ ప్రారంభిస్తూ, 59 యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం కూడా ఉందని తెలుస్తోంది.అసలేం జరిగిందన్న విషయాన్ని పరిశీలిస్తే... ఇటీవలి లాక్ డౌన్ సమయంలో రాజ్ నాథ్ సింగ్, సైన్యాధికారులతో జూమ్ యాప్ ద్వారా ఓ సమావేశాన్ని నిర్వహించారు. తన సమావేశంలో భాగంగా ఓ చిత్రాన్ని ఆయన అధికారులకు యాప్ ద్వారా షేర్ చేశారు. రెండు రోజుల తరువాత ఆ ఫోటో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. తాను సైనిక అధికారులకు షేర్ చేసిన చిత్రం  సోషల్ మీడియాలో కనిపించడంపై రాజ్ నాథ్ తీవ్రంగా స్పందించారు. దీంతోనే ప్రభుత్వ ఉద్యోగులు జూమ్ యాప్ వాడరాదని గత నెలలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో చైనా యాప్స్ పై సెక్యూరిటీ ఆడిట్ చేయించగా, స్పై వేర్, మాల్ వేర్ ఉన్నాయని తేలింది. ఇదే సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాగతాలకు దిగింది.చైనాకు చెందిన యాప్స్ పై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తడం, ఈ యాప్స్ సమాచారాన్ని తస్కరిస్తున్నాయని రిపోర్టులు వెలువడ్డాయి. ఈ కారణాలతో పాటు ప్రజల్లో చైనాపై నెలకొన్న ఆగ్రహాన్ని కాస్తంతైనా చల్లార్చేందుకు చైనా యాప్స్ ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Previous Post Next Post