ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ - అరెస్టు చేసిన పోలీసులు



హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవేల్లి -గండిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను కెసిఆర్ ప్రభుత్వం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ శనివారం ప్రాజెక్ట్ కట్ట ఎక్కి... నిరసన తెలిపిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్,నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ ల తో పాటు సుమారు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పిలువు మేరకు ఈరోజు జలదీక్ష కార్యక్రమంలో భాగంగా గౌరవేల్లి-గండిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో ప్రభుత్వం జాప్యం నాయకులు ఖండించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఏఐసీసీ కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ దివంగత నేతలు మాజి ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ తో పాటు ప్రాంత మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు హుస్నాబాద్ మెట్ట ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు గౌరవేల్లి-గండిపల్లి ప్రాజెక్టు ను ప్రారంభించి పనులు చేపట్టింది తెలంగాణ ఏర్పాటు జరిగిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత జిల్లా లో ఇటీవల కాలం లో ప్రారంభించిన రంగనాయక సాగర్,కొండ పోచమ్మ ప్రాజెక్ట్ ల పై ఉన్న శ్రద్ద హుస్నాబాద్ ప్రాంతంలో ని గౌరవేల్లి ప్రాజెక్ట్ పై వివక్ష చూపించండం దేనికి అని..ప్రశ్నించారు..? నిరసన తెలపడమే నేరంగా చూస్తున్న ప్రభుత్వం వైఖరి ని..అయినా తీవ్రంగా ఖండించారు..ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి అని భూ నిర్వాసితులకు ఇదే జిల్లా లో మిగతా ప్రాజెక్ట్ లకు పరిహారం ఎలా చెల్లించారో అదే విధంగా ఇక్కడి ప్రాంత రైతాంగం కి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post