కరోనా వైరస్ పై పోలిస్ శాఖ విజ్నప్తి



దేశంలో  కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న  దృష్ట్యా కరీంనగర్ జిల్లా  గన్నేరువరం  మండలానికి ఇతర రాష్ట్రాల నుండి,  ముఖ్యంగా మహారాష్ట్ర నుండి వచ్చే వ్యక్తుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండవలెను మరియు ఎవరైనా మహారాష్ట్ర నుండి మన మండలానికి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే వారి యొక్క వివరాలను పోలీస్ శాఖకు కాని‌,  రెవెన్యూ సిబ్బందికి కాని  గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మెడికల్ సిబ్బందికి కాని అట్టి సమాచారం  తెలియజేయవలెను. అట్టి వారిని మేము వెంటనే  హోమ్ క్వారంటైన్ లో ఉంచడం గాని లేదా వైద్య   పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కి తరలించడం గాని జరుగుతుంది  కావున ప్రజలందరు  తమ వంతు బాధ్యతగా ఇటువంటి సమాచారం  తెలియజేసి కరోనా వ్యాపించకుండా సహకరించవలసిందిగా కోరుచున్నాము 

ఎస్ఐ ఆవుల తిరుపతి గన్నేరువరం మండలం 
ఫోన్: 9440901948

Post a Comment

Previous Post Next Post