పోలీసు ఎదుట నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులు ఆరుగురిని సరెండర్ చేయించిన కుర్నాపల్లి గ్రామస్థులు



విలేకరుల సమావేశంలో వివరాలు తెల్పిన ASP

ది.31/05/2020; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో గల కుర్నపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు నిషేధిత మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులను,  గ్రామస్థులు అందరూ కలిసి స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట సరెండర్ చేయించారు. గ్రామంలోని ప్రతి ఇంటినుండి ఒక వ్యక్తి చొప్పున దాదాపు 200 మంది వ్యక్తులు పోలీసు స్టేషన్ కు వచ్చి వారిని సరెండర్ చేయించడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల క్రితం, నిషేధిత మావోయిస్ట్ పార్టీ  వారు, కుర్నపల్లి గ్రామంలోకి వచ్చి, ఆ గ్రామస్థులు మావోయిస్ట్ పార్టీ వారికి సహకరించడం లేదనే కారణంతో విచక్షణా రహితంగా గ్రామస్తులను కొట్టగా, ఆ గ్రామానికి చెందిన ఇర్పా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. మావోయిస్ట్ పార్టీ వారు ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను బలవంతంగా నిషేధ మావోయిస్ట్ పార్టీ కమిటీ గా ఎంపిక చేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యులు అయిన ఇర్పా రామారావు మరియు ఇర్ప సత్తిబాబు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసు వారు అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరు పరచడం జరిగింది.గ్రామస్తులు అందరూ కలిసి ఇక మీద నిషేధిత మావోయిస్ట్ పార్టీ  వారికి సహకరించకూడదని నిర్ణయించుకుని, మిగిలిన నిషేధిత మావోయిస్ట్ పార్టీ  కమిటీ సభ్యులైన 

1) కోరం నాగేశ్వర్రావు(45), S/O దారయ్య.
 2) కొమరం రమేష్(20), S/O రామయ్య( లేటు).
3)సోందే రమేష్(44), S/O రామయ్య అర్జయ్య.
4) కోరం సత్యం(40), S/O పుల్లయ్య( లేటు).
 5) ఇర్పా వెంకటేశ్వర్లు(35), S/O దేవయ్య ( లేటు). మరియు
 6) వాగే కన్నారావు(28), S/O సర్వేశ్వరరావు. అనే వారిని చర్ల పోలీసు స్టేషన్ నందు  ఏ‌ఎస్‌పి  గారి ఎదుట సరెండర్ చేయించడం జరిగింది. ఇక మీదట నిషేధిత మావోయిస్ట్ పార్టీ వారికి సహకరించేది లేదని గ్రామస్థలంతా స్వచ్ఛందంగా తీర్మానం చేసుకోవడం జరిగింది.
Previous Post Next Post