విష వాయువుల నుండి విశాఖ ను కాపాడింది ఇవేనా ?



విశాఖలో విషవాయువు ఐదు గ్రామాలను అతలాకుతలం చేసింది. 12 మంది ప్రాణాలను తీసింది. వందలాది మందిని ఆసుపత్రి పాలు చేసింది. నిజానికి స్టెరీన్ గ్యాస్ వ్యాప్తిచెందే విస్తృతి ఇంకా ఎక్కువగానే ఉందని., అయితే గ్రామాలను దాటి నగరానికి విస్తరించకుండా .. కాపాడింది చుట్టూ ఉన్న కొండలేనని తెలుస్తోంది. స్టైరిన్‌ గ్యాస్‌కు సాంద్రత ఎక్కువ. ఇది 12 అడుగుల ఎత్తులో వ్యాపిస్తుంది. గాలివాటంగా మరికొంత ఎత్తులో వ్యాపించే అవకాశం ఉంది. ప్లాంట్‌లో 5 వేల టన్నుల స్టైరిన్‌ రసాయనం ఉంది.  అత్యంత ప్రమాదకరమైన స్టైరిన్‌ ద్రవరూప రసాయనం ప్రమాదకరమైన గ్యాస్‌గా మారి క్షణాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించింది. ఇది మరింత విస్తరించే అవకాశం ఉన్నా... ఆర్.ఆర్. వెంకటాపురం పరిధి చుట్టుపక్కల ఉన్న కొండలు అడ్డుకున్నాయి.  విశాఖ నగరానిది ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం. ఒకవైపు సముద్రం... మూడు వైపుల కొండలతో నగరం 'గిన్నె'ను పోలి ఉంటుంది. దీన్ని 'బౌల్‌ ఏరియా' అంటారు. దీనివల్ల పరిశ్రమల నుంచి వాయువులు బయటకు వెళ్లవు.  విష వాయువులు, బొగ్గు ధూళి వంటివి గాలిలోకి వచ్చినప్పుడు... సముద్రం మీదుగా వీచే గాలిలోని తేమ వాటితో జత కలిసి బరువుగా మారి తిరిగి నేలపైకి చేరుతుంది.   స్టైరిన్‌  విష వాయువు   5 కిలో మీటర్ల పరిధి  వరకూ వ్యాపిచింది. అంతకంటే విస్తరిస్తే..నకరాన్ని కూడా కమ్మేసే అవకాశం ఉండేది. అయితే వాయువు మరింత విస్తరించకుండా చుట్టూ ఉన్న కొండలు అడ్డుకున్నాయి. దీంతో మరింత పెద్ద ప్రమాదం జరగకుండా అరికట్టినట్టైంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post