రేషన్ కార్డు ఉన్న బియ్యం ఇవ్వని రేషన్ డీలర్ - పట్టించుకోని అధికారులు



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కంసాని లస్మమ్మ భర్త ఎల్లయ్య కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందాడు కంసాని లస్మమ్మ కు కూతుర్లు కానీ కొడుకులు కానీ ఎవరూ లేరు లస్మమ్మ ఒక్కరే జీవనం కొనసాగిస్తుంది అయితే 4 నెలల క్రితం లస్మమ్మ ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ బంధువుల ఇంటికి వెళ్లి ఆరోగ్యం బాగా చేసుకుని తిరిగి గన్నేరువరం కి వచ్చింది ఇంతలోనే ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు ప్రభుత్వ రెవెన్యూ అధికారులు రేషన్ కార్డు కట్ చేశారు లాక్ డౌన్ నేపథ్యంలో రేషన్ డీలర్ వద్దకు వెళ్లి రేషన్ కార్డు చూపించిన రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ది రిపోర్టర్ టీవీ రిపోర్టర్ రాజ్ కోటి ని సంప్రదించారు దీంతో ఆమెను తీసుకొని మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం కి వెళ్లి స్థానిక ఎమ్మార్వో రమేష్ కు వివరాలన్నీ చెప్పారు దీంతో వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు రేషన్ కార్డు కంప్యూటర్ లో చెక్ చేయగా ఆరు నెలల క్రితం రేషన్ కట్ చేశారని ఎమ్మార్వో చెప్పారు ఎమ్మార్వో ను రిపోర్టర్ వివరణ అడగగా రేషన్ కార్డు వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని డీలర్ కు చెప్పి బియ్యం అందజేస్తామని హామీ ఇచ్చారు దీంతో లస్మమ్మ తినడానికి తిండి లేక అవస్థలు పడుతోంది ఉండడానికి రేకుల ఇల్లు ఉంది  మరుగుదొడ్డి లేని పరిస్థితి ఈమెకు ఎవరు కూడా దిక్కు చూడు లేని పరిస్థితి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా లస్మమ్మ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆమె ది రిపోర్టర్ టీవీ ద్వారా వేడుకుంటుంది
Previous Post Next Post