ఎపి లో 62 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ!


ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు చేస్తున్న కొద్దీ కరోనా వైరస్ కేసులు మరిన్ని బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 8,415 శాంపిళ్లను పరీక్షించగా మరో 62 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 51 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,514 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,734 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కృష్ణా జిల్లాలో కొవిడ్‌-19 వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య మొత్తం 55కి చేరింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post