కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలలో ఒక ఎకరం లోపు ఉన్న పొగాకు రైతులకు, పొగాకు కూలీలకు నిత్యావసర వస్తువల పంపిణి చేయుటకొరకు లారీలను గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలకు తరలించడానికి 3 లారీలకు పట్టాభిపురం, గుంటూరు లో జెండా ఊపి ప్రారంబించిన టూబాకో బోర్డ్ చైర్మన్ యడ్లపాటి రఘునాధ బాబు.
యడ్లపాటి రఘునాధ బాబు మాట్లాడుతూ హిందూస్థాన్ యునిలీవర్ మరియు బయఫ్ స్వచంద సంస్థ, పూణే వారి ఆర్ధిక సహాయంతో 2000 కుటుంబాలకు పొగాకు రైతులకు, పొగాకు కూలీలకు నిత్యావసర వస్తువల పంపిణి చేయుటకొరకు ఈరోజు నిత్యావసర వస్తువలను 3 లారీలలో పంపించడం జరిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వణికిస్తోందని, రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోందని, కరోనా కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయని ఈ సందర్భముగా తెలియజేశారు. భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా గ్రామీణవాసుల నుంచి వలస కార్మికుల వరకు ఉపాధి కోల్పోయారని, కరోనా కష్టకాలంలో ఆకలితో బాధపడేవారికి సాయం చేసేందుకు తమ వంతు సాయం అందించేందుకు హిందూస్థాన్ యునిలీవర్ మరియు బయఫ్ స్వచంద సంస్థ, పూణే వారితో మాట్లాడి , వారి ఆర్ధిక సహాయంతో 25 లక్షల రూపాయల విలువచేసే నిత్యావసర వస్తువల కిట్లను గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలలో ఒక ఎకరం లోపు ఉన్న పొగాకు రైతులకు, పొగాకు కూలీలకు నిత్యావసర వస్తువల పంపిణి చేయడం జరుగుతుందన్నారు. బీ జె పీ జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు మాట్లాడుతూ టూబాకో బోర్డ్ చైర్మన్ యడ్లపాటి రఘునాధ బాబు గారు రైతుల పక్షపాతి అని, రైతులకొరకు రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయుటకొరకు, రైతులకు సేవ చేయుట కొరకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కరోన కష్ట కాలంలో పొగాకు రైతులను, రైతు కూలీలను ఆదుకోవడానికి యడ్లపాటి రఘునాధ బాబు గారు హిందూస్థాన్ యునిలీవర్ మరియు బయఫ్ స్వచంద సంస్థ, పూణే వారితో మాట్లాడి వారి ఆర్ధిక సహాయంతో పొగాకు రైతులను, రైతు కూలీలను ఆదుకోవడానికి 25 లక్షల రూపాయల విలువచేసే నిత్యావసర వస్తువల కిట్లను అందించడం వారి యొక్క కృషికి నిదర్సనం అన్నారు. ఈ కిట్ లో
5 కేజీల బియ్యం,
5 కేజీల గోధుమ పిండి,
1 కేజీ కంది పప్పు,
1 కేజీ పంచదార,
మూడు బట్టల సబ్బులు, మూడు స్నానం చేసే సబ్బులు, ¼ కేజీ రెడ్ లేబిల్ టీ పౌడర్ ఉన్నాయని
వై.వి. సుబ్బారావు తెలియజేశారు.
ఈ కార్యక్రమములో
బయఫ్ స్వచంద సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి గోపాల రెడ్డి,
బి.జె.పి. యన్.జి.ఓ సెల్ రాష్ట్ర కన్వీనర్ హనుమాన్ ప్రసాద్, జి.వి.రావు,
పాపారావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post a Comment