లాక్‌డౌన్‌లో ఈ -పాస్‌కు ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు : సిపి అంజనీ కుమార్



లాక్‌డౌన్‌లో అత్యవసర సేవల కోసం పోలీసులు ఈ-పాస్ జారీ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా అందజేస్తున్నట్టు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ -పాస్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఆయన చెబుతున్న వీడియోను పోలీసు శాఖ విడుదల చేసింది.అత్యవసర సేవల కోసం వ్యక్తులు, వాహనాలు, సంస్థలు, పరిశ్రమలకు పది నిమిషాల్లోనే ఈ-పాస్‌ లభిస్తుందని సీపీ చెప్పారు. దీని కోసం www.hyderabadpolice.gov.in లో లాగిన్ అవ్వాలి. అందులో ఈ -పాస్‌ లింక్‌ను ఓపెన్ చేసి.. అత్యవసర సేవల వివరాలు, అనుమతికి కారణాలు, వ్యక్తి ఫొటో, ధ్రువీకరణ పత్రం (ఆధార్, వాహనం ఆర్సీ) అప్‌లోడ్ చేయాలి. ఈ మొత్తం ప్రక్రియ పది నిమిషాల్లోపే పూర్తవుతుంది.

అనంతరం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దరఖాస్తును పరీశించి వెంటనే అనుమతి ఇస్తారు.  ఈ మేరకు మొబైల్‌ నంబర్ కు రెఫరెన్స్ నంబర్ తో  కూడిన సంక్షిప్త సందేశం వస్తుంది. దాని ద్వారా  క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ-పాస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అంజనీ కుమార్ తెలిపారు. ప్రతి చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారని చెప్పారు. ఈ -పాస్‌తో పాటు గుర్తింపు కార్డును కూడా వెంటబెట్టుకోవాలని సూచించారు. ఈ -పాస్‌ కోసం ఎవ్వరూ కమిషనరేట్‌కు గానీ, ఇతర పోలీస్‌ స్టేషన్ల వద్దకు కానీ వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post