కరోనా వైరస్(కోవిడ్-19) నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ పోలీసులు వేసిన సీలును తొలగించి యజమాని ఆదేశంతో తమ వైన్స్ షాపునుండి మద్యం బాటిళ్లు తరలించి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుందామని ప్రయత్నించిన ఇద్దరిని అరెస్ట్ చేసిన కుషాయిగూడ పోలీసులు...
రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని మహేష్ నగర్ లో ఉన్న తేజ వైన్స్ షాపు యజమాని సిద్ధి రాములు గౌడ్ ఆదేశాలతో అందులో క్యాషియర్ గా పనిచేస్తున్న చిమ్ముల వాసురెడ్డి అతని స్నేహితుడు చెరుకుపల్లి లింగారెడ్డి ఇద్దరు కలిసి మారుతి సెలారియో వాహనంలో వైన్స్ షాపుకు ఎక్సైజ్ పోలీసులు వేసిన సీలు తొలగించి సుమారు 41 వెయ్యి రూపాయల విలువ చేసే 41 మెక్ డోవెల్స్ ఫుల్ బాటిళ్లు, 18 రాయల్ స్టాగ్ ఫుల్ బాటిళ్లు కారులో తరలిస్తుండగా బ్లూకోల్ట్, పెట్రోలింగ్ పోలీసులు చేజ్ చేసి పట్టుకుని కుషాయిగూడ పోలీసు స్టేషన్ కు తరలించి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, కారును సీజ్ చేసి, అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిపై 448, 427, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన కుషాయిగూడ పోలీసులు, పరారీలో తేజ వైన్స్ యజమాని సిద్ధి రాములు గౌడ్, ప్రభుత్వ నిబంధనలను భేఖాతారు చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్.
Post a Comment