కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గురువారం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి గన్నేరువరం, జంగపల్లి రెండు ప్రభుత్వ పాఠశాలలు కాగా గుండ్లపల్లి లో రెండు ప్రైవేట్ పాఠశాలలు హాజరయ్యారు గుండ్లపల్లి ప్రవేట్ విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా పరీక్ష సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు ప్రారంభం కాగా గుండ్లపల్లి లో రెండు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు కేవలం పరీక్ష సమయానికి ఐదు నిమిషాల ముందు మాత్రమే గేటు వద్దకు చేరుకున్నారు గుండ్లపల్లి నుండి ఆయా పాఠశాలల ప్రత్యేక బస్సులోనే విద్యార్థులను తీసుకురాగా పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందు తీసుకు రావాల్సి ఉన్నా ఐదు నిమిషాల వరకు వేచి ఉండటం సబబు కాదని తల్లిదండ్రులు అంటున్నారు ఇప్పటికైనా విద్యార్థులను సమయపాలన కు తీసుకరావాలని అధికారులు కోరుతున్నారు పర్యవేక్షకులు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 4 పాఠశాలలకు గాను 130 విద్యార్థులు హాజరయ్యారని 100 శాతం విద్యార్థులు హారయ్యారని తెలిపారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఉండడంతో పరీక్ష కేంద్రంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు గమనిస్తే వారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామని తెలిపారు. హెల్త్ సెంటర్ మరియు హాండ్ వాష్ కూడా ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణం లో పరీక్ష జరిగిందని తెలిపారు.
Post a Comment