అమరావతి: రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ నేతలతో సత్సంబంధాలు ఉన్న నేత ఎస్సార్‌సీపీ ఎంపీ రాఘురామ కృష్ణంరాజు. నాయకత్వం అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బొచ్చులో నాయకత్వం ఎవడికి కావాలంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆశ్చర్యపోవడం సొంత పార్టీ వైసీపీ కార్యకర్తల వంతయింది. పార్టీలోనూ దీనిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలో స్థానికంగా విభేదాలు తలెత్తాయి. వైసీపీలోని రెండు వర్గాలు తమ అభిమాన నేతకు ఛైర్మన్ సీటు ఇవ్వాలని కోరడంతో అంతర్గతంగా ముసలం మొదలైంది. దీనిపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడారు. అందరం మంత్రి మోపిదేవితో చర్చించి ఏకాభిప్రాయంతో ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎంపీ హామీ ఇస్తుండగానే పార్టీ కార్యకర్తలు జై జగన్, జగన్ నాయకత్వం వర్దిల్లాలి, రఘురామ కృష్ణం రాజు నాయకత్వం వర్దిల్లాలని నినాదాలు చేశారు. పనిలో పనిగా ఓ కార్యకర్త మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేయడంతో ఎంపీ అసహనానికి లోనయ్యారు. ఎవడి నాయకత్వం కావాలి.. బొచ్చులో నాయకత్వం, నోరు మూసుకు కూర్చోవాలంటూ కార్యకర్తలపై మండిపడ్డారు. వైసీపీ ఎంపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Post a Comment