‘జనతా కర్ఫ్యూ’ నిర్వహిద్దాం ....అత్యవసర సేవల్లో పనిచేస్తున్నవారికి కృతజ్ఞతలు తెలుపుదాం: వి.సుధాకర్

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ అన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. అత్యవసర పనులకు మాత్రమే బయటికి వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా ఉండే రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దని, కరోనా వ్యాప్తిని అడ్డుకుని ప్రజల్లో అవగాహన పెంచుదామని పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో పనిచేస్తున్నవారికి ఆదివారం కృతజ్ఞతలు తెలుపుదాం అంటూ సుధాకర్ పిలుపునిచ్చారు.

https://www.pemraindia.org/archives/663

0/Post a Comment/Comments

Previous Post Next Post