హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర బలగాలు నగరానికి చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, బలగాలు కావాలని కేంద్రాన్ని తాము కోరలేదని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. సాధారణ ప్రక్రియలో భాగంగానే బలగాలు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, కర్ణాటకలోని బీదర్ నుంచి కేంద్ర పారామిలటరీ, ఇతర బలగాలు నిన్న హైదరాబాద్ చేరుకున్నాయి. మొత్తం 80 వాహనాల్లో జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డు మీదగా బలగాలు హైదరాబాద్‌లో అడుగుపెట్టాయి. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకే ఈ బలగాలు హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది.
Post a Comment