కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు గాను గురువారం ప్రార్ధన సమయానికి ఓకే ఉపాధ్యాయుడు మాత్రమే హాజరు కావడంతో విద్యా కమిటీ చైర్మన్ నగునూరు శంకర్ వచ్చిన ఉపాధ్యాయునితో మాట్లాడుతూ సమయపాలన పాటించడం లేదని ఉపాధ్యాయుని నిలదీశారు గతంలో పలుమార్లు ఉపాధ్యాయులు ఇష్టారీతిన పాఠశాలకు ఉదయం మధ్యాహ్నం వస్తున్నారని ప్రధానోపాధ్యాయులకు తెలిపిన ఫలితం లేదన్నారు గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి తదితరులు ఇప్పటికైనా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పాలన్నారు పాఠశాలలో ఇష్టారీతిన సెల్ఫోన్లతో మాట్లాడుతూ తమ సొంత పనులు చేసుకుంటున్నారని అన్నారు
Post a Comment