స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన
వరంగల్ అర్బన్ జిల్లా బీమదేవరపల్లి మండలం “వంగర గ్రామ పంచాయతీ” లోని ఆయన స్వగృహం ఇక మ్యూజియంగా మారనుంది. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన స్మారకార్థo ఈకార్యక్రమాన్ని ఆయన తనయుడు పీవీ ప్రభాకర్ రావు చేపట్టనున్నారు. పీవీ ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని సుందరికరించడంతో పాటు సమీపంలోనే మరో నూతన గృహాన్ని నిర్మించారు. మ్యూజియంలో పీవీ ఉపయోగించిన సుమారు150 రకాల వస్తువులు ప్రదర్శనకు ఉంచనున్నారు. కాగా వచ్చే నెల 13,14,15వ, తేదీల్లో నూతన గృహప్రవేశంతో పాటు మ్యూజియాన్ని గవర్నర్ తమిళ సై సౌదర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు
Post a Comment