గన్నేరువరం: మాతృ వందనం - పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంఈఓ మధుసూదనా చారి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు 10 జిపీఏ సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తల్లులకు పాదాభివందనాలు చేశారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, ఉపసర్పంచి బూర వెంకటేశ్వర్, ప్రధానోపాధ్యాయులు కట్ట రవీంద్ర చారి, విద్యా కమిటీ చైర్మన్ బుర్ర సత్యనారాయణ గౌడ్, ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ బుర్ర జనార్దన్ గౌడ్,ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=9OYR3-O_STU

0/Post a Comment/Comments

Previous Post Next Post