ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే జనతా కర్ఫ్యూ ప్రారంభమైందని సీపీ అంజనీకుమార్ అన్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారని, వారి నుంచి పూర్తి సహకారం లభిస్తోందని చెప్పారు. దేశ చరిత్రలోనే మొదటిసారి ఇలాంటి కర్ఫ్యూ కొనసాగుతోందని తెలిపారు. వారి మద్దతు భవిష్యత్తులోనూ ఇలాగే ఉండాలని ఆయన కోరారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన చెప్పారు. అత్యవసర, వైద్య సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. కర్ఫ్యూకు హైదరాబాద్ ప్రజలందరూ సహకరిస్తున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. హైదరాబాద్ అంతా శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా ఇళ్లలోనే ఉండాలని చెప్పారు.
Post a Comment