కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఈజీఎస్ నిధుల కింద 25 లక్షల రూపాయల సిసి రోడ్లను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంజూరు చేయగా గురువారం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఒకటో విడతలో 25 లక్షలు మంజూరు చేయగా గన్నేరువరంలో ఐదు లక్షలతో పెద్దమ్మ టెంపుల్ దగ్గర, మరో ఐదు లక్షలతో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర 15 లక్షలతో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు దగ్గర సీసీ రోడ్ల పనులు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు న్యాత సుధాకర్,బొడ్డు సునీల్ ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, వార్డు సభ్యులు టేకు అనిల్ , పుల్లెల నరేందర్,న్యాత జీవన్, పుల్లెల సాయి కృష్ణ, టేకు జోగయ్య, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు
Post a Comment