ఆయన అరవై ఎనిమిదేళ్ల వృద్ధుడు. ఇంట్లో కూర్చున్నాడు. తమ కాలనీలోనే ఉండే ఓ 15 ఏళ్ల అబ్బాయి అక్కడికి వచ్చాడు. సరదాగా ప్రాంక్ చేసి ఫూల్ చేశాడు. దీనిపై ఆగ్రహం చెందిన ఆ వృద్ధుడు.. ఆ అబ్బాయిపై దాడి చేశాడు. గట్టిగా పట్టుకుని గొంతు పిసికడంతో అబ్బాయి చనిపోయాడు. మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ఘట్కోపర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హాస్పిటల్ కు తీసుకెళ్లే సరికే..ఘట్కోపర్ ప్రాంతంలోని ఇండ్ల సముదాయాల్లో 68 ఏళ్ల హిమ్మత్ గోహిల్ ఉంటారు. అదే కాలనీలో ఉండే 15 ఏళ్ల శివశంభు పవార్ శనివారం రాత్రి హిమ్మత్ గోహిల్ ఇంటికి వచ్చి ప్రాంక్ చేశాడు. దీనిపై హిమ్మత్ గోహిల్ ఆగ్రహంతో శివశంభు గొంతు పిసికాడు. ఆ అబ్బాయి స్పృహ తప్పిపడిపోయాడు. ఇది చూసిన ఇరుగు పొరుగు అబ్బాయి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే శివశంభు చనిపోయినట్టుగా వైద్యులు తెలిపారు. పోలీసులు హిమ్మత్ ను అరెస్టు చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Post a Comment