భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రేపు చేపట్టనున్న జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాల వల్ల ప్రయోగం వాయిదా పడినట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు. 2,268 కేజీల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ద్వారా నింగిలోకి పంపాల్సి ఉంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం రేపు సాయంత్రం 5.43 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోవాల్సి ఉంది. అయితే, సాంకేతిక అవాంతరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. మళ్లీ ప్రయోగం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
Post a Comment