మురికి కూపంలో కారంపూడి - SAVE KAREMPUDI

పండ్ల వ్యాపారస్తులకు అడ్డాగా మారిన దశాబ్దకాలంనాటి చరిత్ర కలిగిన తాగు సాగు లేరు మన నాగులేరు…

వివరాల్లోకి వెళితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన పల్నాటి నాగులేరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పల్నాటి వీరుల జీవనది నాగులేరు ఇప్పుడు పట్టణంలోని పండ్ల వ్యాపారస్తులకు కొబ్బరి బొండాల వ్యాపారస్తులకు అడ్డాగా మారింది. దాదాపు 12 గ్రామాల కి , వేసవి కాలం కొన్ని వందల జీవులకు, తాగునీరు అందించే నాగులేరు పట్టణ వ్యాపారస్తులకు కొబ్బరి బొండాల వ్యాపారస్తులకు అడ్డాగా మారి ఏ విధంగా కలుషితం అయిందో ఆ నది పై వెళ్తున్న వాహనదారులను అడిగినా.. అటువైఫ్ మనం వెళ్లినా తెలుస్తుంది.

పంచాయతీ అధికారులు వందల వేల సార్లు చెప్పినా.. నోటీసులు ఇచ్చినా వారి తీరు మారకపోగా ఎక్కువగా చెత్తను వేస్తూ ప్రజలను అనారోగ్యపాలు చేయడం పరిపాటిగా మారింది. గ్రామానికి నడిబొడ్డున ఉన్న నాగులేరు దాదాపు 30 అడుగుల మేరకు ప్లాస్టిక్ వస్తువులు, కొబ్బరి బోండాలు, కుళ్లిపోయిన పండ్లు వేయడం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పంచాయతీ వారు ఉదయం సాయంత్రం డంపింగ్ ట్రాక్టర్లు వస్తున్నాయి అయినా కానీ … వ్యాపారస్తులు మాత్రం పంచాయతీ వారికి సహాకరించడం లేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు . కుళ్ళినవి , ప్లాసిక్ లాంటివి వేయవద్దని హెచ్చరికలు చేసిన నాగలేరులో వేయటం మానడం లేదు . చెప్పుకోలేని విధంగా దుర్వాసన రావడం ఇక్కడ పరిస్థితి నెలకొంది.ఇదే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటే కొత్త కొత్త జబ్బులు రావడం ఖాయమని చెప్పాలి.ఇకనైనా కొబ్బరిబొండాల వ్యాపారస్తులు,కాయల వ్యాపారస్తులు గమనించి డంపింగ్ యార్డ్ కి తమ వ్యర్థ పదార్థాలను తరలించి పంచాయతీ వారికి సహకరించాలని పట్టణ ప్రజలు

కోరుకుంటున్నారు.

 

0/Post a Comment/Comments

Previous Post Next Post