కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని మాదాపూర్ గ్రామంలో కిసాన్ క్రెడిట్ కార్డులపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి మాట్లాడుతూ పిఎం కిసాన్ లో అర్హులైన ప్రతి రైతు తప్పకుండా కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలని రైతులు తమకు సంబంధించిన బ్యాంకులకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు రైతులకు సల్ప కాలిక రుణ సదుపాయం అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు రైతులు తమ యొక్క పట్టాదారు పాసుపుస్తకం ఆధార్ కార్డు క్రాప్ లోను అకౌంట్లను జతపరిచి దరఖాస్తు ఫారం నింపి బ్యాంకులో ఇస్తే బ్యాంకు వారు దరఖాస్తు చేసుకున్న 14 రోజుల్లోపు కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తానన్నారు కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటుందని ఒకవేళ రైతు మరణిస్తే 50వేల రూపాయలు ప్రమాదానికి గురైతే 25000 లభిస్తాయన్నారు 70 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వారికి భీమ పాలసీ ఉండదన్నారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, మండల కో ఆర్డినేటర్ బోడ మాధవరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చింతలపల్లి నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ కుమ్మరి సంపత్,టిఆర్ఎస్ నాయకులు దొడ్డు మల్లేశం, ఏఈవోలు సౌమ్య,అనూష, వివిధ గ్రామ సర్పంచులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment