తెలంగాణలో గ్రీన్ ఇండియా చాలెంజ్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల నుంచి ఈ చాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ ను తాజాగా సినీ దర్శకుడు వీవీ వినాయక్ స్వీకరించారు. హైదరాబాదులోని తన కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భం మాట్లాడుతూ, మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని అన్నారు. ఈ చాలెంజ్ కు రూపకల్పన చేసిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. అంతేకాదు, చాలెంజ్ లో భాగంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్, నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, మల్లిడి సత్యనారాయణరెడ్డిలను నామినేట్ చేశారు.
Post a Comment