కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం

కరీంనగర్‌ జిల్లా : కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిని ఓ ప్రేమోన్మాది గొంతుకోసి హతమార్చాడు. కరీంనగర్‌లోని విద్యానగర్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలిని సహస్ర జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ముత్తా రాధికగా గుర్తించారు. విద్యానగర్‌లోని పద్మావతి ఫంక్షన్‌ హాల్‌ వెనుకభాగంలో ఉన్న రాధిక ఇంట్లో ఆమెను దుండగుడు హతమార్చాడు. రాధిక తల్లిదండ్రులు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. సాయంత్రం వారు ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో కుమార్తె పడి ఉండటం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే దుండగుడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు పోలీసులు బృందాలుగా ఏర్పడి దుండగుడి కోసం గాలిస్తున్నారు.

 

 

0/Post a Comment/Comments

Previous Post Next Post