ఆస్తి తగాదాల్లో కక్ష పెంచుకుని ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు తో పాటు జరిమానా విధిస్తూ కరీంనగర్ మూడో అదనపు లైషన్స్ కోర్టు న్యాయమూర్తి కృష్ణమూర్తి తీర్పు చెప్పారు వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన అనుమాండ్ల మల్లయ్యకు ఆయన సోదరుని కుమారుడు అనుమాండ్ల భూమయ్యకు 25 సంవత్సరాలుగా భూమి వివాదం జరుగుతుంది దీనిపై ఎన్నిమార్లు పెద్దలు చెప్పిన ఇరువురు వినలేదు దీంతో కక్ష పెంచుకున్న చిన్న భూమయ్య 2019 ఫిబ్రవరి 17న మల్లయ్య సాయంత్రం వ్యవసాయ భూమి దగ్గర ఒంటరిగా పని చేసుకుంటున్నాడు ఇదే అదనంగా భావించిన చిన్న భూమయ్య భూమి గురించి మల్లయ్యతో ఘర్షణ పడి కట్టెతో మల్లయ్య తలపై తీవ్రంగా కొట్టి పారిపోయాడు తీవ్రగాయాలతో మల్లయ్య చనిపోగా అతని కుమారుడు అంజయ్య గన్నేరువరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు నిందితుడు అరెస్టు చేసి దర్యాప్తు తదుపరి తిమ్మాపూర్ సిఐ కరుణాకర్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి కృష్ణమూర్తి నిందితుడు అనుమాండ్ల భూమయ్య కు జీవిత ఖైదు తో పాటు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు
Post a Comment