రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తండ్రి మరణం తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకింది మంగళవారం జరిగిన సంఘటన గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది మంచిర్యాల జిల్లా చెన్నూరు కు చెందిన అరవెల్లి వసంతం సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు కాగా వసంతం మృతదేహాన్ని వాహనంలో తీసుకెళ్తుండగా, కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్న వసంతం కూతురు ఆరవెల్లి సాయి ప్రియ (32) వాంతులు వస్తున్నాయి అనడంతో గోదావరి బ్రిడ్జి వద్ద ఆపగా సాయి ప్రియ కిందికి దిగి గోదారిలో దూకి గల్లంతయింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే సాయి ప్రియ గోదావరి నదిలో మునిగిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. కాగా సాయి ప్రియ మంచిర్యాల జిల్లా కోటపల్లి ఎస్సీ ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.
Post a Comment