కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని జంగపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అదే గ్రామానికి చెందిన బుర్ర కనకయ్య గౌడ్ ఆరువేల విలువగల తెలుపు ఆకుపచ్చ రంగులతో కూడిన నాలుగు రైటింగ్ బోర్డులను ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరికి మంగళవారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ఇంకా మెరుగైన సౌకర్యాలు ఉంటే బాగుంటుందని ఈ బోర్డులను అందజేస్తున్నట్లు తెలిపారు అన్ని సబ్జెక్టులకు బ్లాక్ బోర్డు పైన ఉపాధ్యాయులు రాస్తున్నారు ఈ బోర్డులో స్పష్టంగా అక్షరాలు ఏర్పడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వరికోల్ వెంకటి, ఉపాధ్యాయులు రజిని, రవీందర్,రమేష్ పాల్గొన్నారు.
Post a Comment