హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మహానేత, యుగ పురుషుడు పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి టౌన్ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు,కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ బలిదాన్ దివస్. 1968 ఫిబ్రవరి 11న ఆయన అకాల మరణం చెందారు.ఆయన సెప్టెంబర్ 25న ఉత్తర ప్రదేశ్ లోని మధుర దగ్గర ‘నగ్ల చంద్రభాన్’ అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్దిమంది స్వయంసేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచారక్ స్థాయికి ఎదిగారు.1952లో భారతీయ జన సంఘ్ లొ చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1967లొ జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టేవరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణాoతరము పార్టీ బాధ్యతలు భుజానవేసుకొని విజయపధంలో నడిపించారు.అలాగే ఆర్.ఎస్.ఎస్ వారపత్రిక పాంచజన్య మరియు లక్నొ దినపత్రిక ‘స్వదేశ్’లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్దాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మతా మానవతా వాదం , శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు, హిందీలో ‘చంద్రగుప్త మౌర్య’ నాటకం, మరాఠీ నుండి ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు.భారతీయ జనసంఘ్కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.దేశభక్తి ఉన్నత భావాలు కలిగిన పండిట్ ఉపాధ్యాయ నాయకత్వం వహించే వ్యక్తి సమాజమంతటి పట్ల ఆత్మీయత గల వాడై ఉండాలి అనే వారు. ఆత్మీయత కూడిన వ్యక్తిగత సంబంధాల ద్వారానే ప్రేరణ కలిగించగలం.ఇది ఉపదేశాల వల్ల ,దూరం నుంచి పెత్తనం చేయడం వల్ల జరగదని భావించేవారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెల్దండి సంతోష్,బిజెపి సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్, కవ్వ వేణుగోపాల్ రెడ్డి, జనగామ వేణుగోపాల్ రావు,కందుకూరి సతీష్,బొమ్మగాని సతీష్,పోలోజు రవీందర్,కోర్రే దినేష్,జన్నోజు శ్రీకాంత్, అన్నబోయిన ప్రశాంత్,పూదరి వెంకటేష్, బిజేవైయం నాయకులు కర్ణకంటి నరేష్, బొప్పిశెట్టి భీమేశ్వర్, వేముల శ్రావణ్ కుమార్, ఎగ్గోజు రాజు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment