కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన బైకు భార్య మృతి భర్తను కాపాడిన పోలీసులు
పెళ్లిరోజు జరుపుకునేందుకు స్వగ్రామానికి వెళుతుండగా ఘటన
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రం సమీపంలోని కాకతీయ కాలువలోకి ఆదివారం రాత్రి బైకు దూసుకుపోయింది ఈ ఘటనలో భార్య గల్లంతవగా భర్తను పోలీసులు రక్షించారు వివరాల్లోకి వెళితే గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్ 33 సం,, ఆయన భార్య కీర్తన 27 సం,, ఆదివారం రాత్రి కరీంనగర్ వచ్చారు సోమవారం వారి పెళ్లి రోజు కావడంతో షాపింగ్ చేసుకుని రాత్రి తిరిగి ప్రయాణమయ్యారు రాజీవ్ రహదారి పై వెళుతుండగా కాకతీయ సమీపంలోకి రాగానే బైక్ నడుపుతున్న ప్రదీప్ కళ్ళల్లో పురుగులు పడ్డాయి వాటిని తోలే ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది ఇదే సమయంలో ఎల్ఎండి పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూ కోట్స్ సిబ్బంది కాలువ వెంట పెట్రోలింగ్ చేస్తున్నారు వారిని చూసిన ప్రదీప్ కాపాడండి అంటూ కేకలు వేశాడు గమనించిన పోలీసులు ఎస్సై నరేష్ కు సమాచారం అందించారు ఆయన తాళ్లతో సంఘటన స్థలానికి చేరుకొని ప్రదీప్ ను రక్షించారు కీర్తన నీటిలో కొట్టుకు పోయింది ఆమె మృతదేహాన్ని ముంజంపల్లి సమీపంలో గుర్తించారు సోమవారం పెండ్లి రోజు జరుపుకునేందుకు స్వగ్రామానికి వెళుతుండగా రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై నరేష్ రెడ్డి తెలిపారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు
ప్రాణాలు పోయినా పట్టించుకోరా – ప్రజా ప్రతినిధులు అధికారులు
నెల రోజుల క్రితం సుల్తానాబాద్ కు చెందిన భార్య భర్తలు కారులో ప్రయాణం చేస్తుండగా అలుగునూర్ కాకతీయ కెనాల్ వద్ద చేపల మార్కెట్ లో చేపలు కొనుగోలు చేసి తిరిగి ప్రయాణానికి బయలుదేరిన దంపతులు కారు కెనాల్ లోకి దూసుకుపోయింది అందులో భార్య భర్తలు మృతి చెందారు
ఇన్ని ప్రమాదాలు జరిగిన ప్రజా ప్రతినిధులు అధికారులు మాత్రం కాకతీయ కెనాల్ వద్ద రక్షణ కల్పించకపోవడం ప్రమాద నివారణ చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందారు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేసిన ప్రాణాలు దక్కేవి కాకతీయ కాలువకు ఇరువైపుల చేపల అమ్మకాలను తీసివేసి ప్రత్యేకంగా మార్కెట్లో ఏర్పాటు చేస్తే ప్రాణాలు దక్కుతాయి అని ప్రయాణికులు అంటున్నారు
Post a Comment