కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ నిన్న రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో ఒక శవాన్ని వెతుకుతుంటే మరో రెండు శవాలు కాకతీయ కాలువలోని కారులో కుళ్లిపోయిన స్థితిలో దొరికాయి.15 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి కాకతీయ కెనాల్ లో పడిపోయిన ఓ కారు, ఈ ఉదయం బయటపడగా, అందులో రెండు కుళ్లిపోయిన మృతదేహాలు లభ్యమైంది
ఈ రెండు మృతదేహాలూ పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, ఆమె భర్త లక్ష్మీపూర్ కు చెందిన సత్యనారాయణరెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ రెండు వారాలకు పూర్వం తమ కుమార్తె వినయ శ్రీతో కలసి బయలుదేరారని, అప్పటి నుంచి అదృశ్యమయ్యారని పోలీసు కేసు కూడా నమోదైంది అదే రోజున వీరు ప్రయాణిస్తున్న కారు ఏపీ 15 బిఎన్ 3438 ఓల్క్ష్వాగేం పోలో కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక కారులో వినయశ్రీ మృతదేహం కనిపించకపోవడంతో ఆమె కోసం గాలింపు తీవ్రతరం చేశారు
Post a Comment