వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై టీడీపీ కార్యకర్తలు ఇటీవల దాడికి యత్నించిన ఘటన తెలిసిందే. ఈ ఘటనపై సురేశ్ స్పందిస్తూ, రైతులు, జేఏసీ ముసుగులో గూండాలతో తనపై దాడికి యత్నించారని తన పై దాడికి యత్నం వెనుక కచ్చితంగా చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ఆరోపించారు. భవిష్యత్ లో తనకు ఏమైనా జరిగితే చంద్రబాబు, లోకేశ్ దే బాధ్యత అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్ కు నోటీసులిచ్చి విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నట్టు చెప్పారు. లోకేశ్ తన ఎమ్మెల్సీ పదవి పోతుందేమోనన్న భయంలో ఉన్నారని, ఆయనలో అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. రాజధానికి ఇచ్చిన భూములను తిరిగి ఇచ్చేస్తే తీసుకోవద్దని దళితులను చంద్రబాబు భయపెడుతున్నారని ఆరోపించారు.
Post a Comment