అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ సెనేటర్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న బెర్నీ శాండర్స్ మండిపడ్డారు. భారత పర్యటనలో ఉండగా ఢిల్లీ అల్లర్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ట్రంప్ నాయకత్వ వైఫల్యానికి ఇదొక ఉదాహరణ అని విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో సమవేశమైన సందర్భంగా ఢిల్లీ అల్లర్లపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా… ఢిల్లీలో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై ప్రధాని మోదీతో తాను మాట్లాడలేదని, ఇది భారత్ అంతర్గత విషయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా శాండర్స్ విమర్శలు గుప్పించారు. భారత్ లో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ముస్లిం వ్యతిరేక దాడుల్లో 27 మంది వరకు చనిపోయారని, చాలా మంది గాయపడ్డారని ఆయన అన్నారు. మానవహక్కులకు సంబంధించి ఇది కచ్చితంగా నాయకత్వ వైఫల్యమేనని చెప్పారు.
Post a Comment