మధ్యప్రదేశ్‌లో అత్యంత అరుదైన ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా ఆరుగురికి జన్మనిచ్చింది. శనివారం శెయోపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. జన్మించిన ఆరుగురు శిశువుల్లో ఇద్దరు శిశువులు ఆ వెంటనే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మిగతా నలుగురూ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నారు. వారిని సిక్ న్యూబార్న్స్ కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సీయూ)లో ఉంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఒకే కాన్పులో ఆరుగురు జన్మించారని చెప్పగానే 22 ఏళ్ల ఆ తల్లి ఒక్కసారిగా షాక్‌కు గురైందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా ‘నార్మల్ డెలివరీ’ అయిందని పేర్కొన్నారు. బతికి ఉన్న నలుగురు శిశువుల బరువు 500 గ్రాముల నుంచి 790 గ్రాముల వరకు ఉన్నట్టు ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్‌బీ గోయల్ తెలిపారు.
Post a Comment