హాజీపూర్ కేసుల్లో సమర్థవంతంగా వ్యవహరించిన సీపీ భగవత్, దర్యాప్తు బృందాన్ని ఘనంగా సత్కరించిన డీ.జీ.పీ మహేందర్ రెడ్డి.

హాజిపూర్ సీరియల్ హత్యలు,రేప్ లకు పాల్పడ్డ నిందితునికి అతితక్కువ సమయంలో రెండు కేసుల్లో మరణ శిక్ష, ఒక కేసులో యావజ్జీవ శిక్ష విధించడంలో కీలక పాత్ర వహించిన రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ సుధీర్ బాబులతో పాటు సంబంధిత అధికారులను డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు ఘనంగా సత్కరించారు. ఈ  సంఘటనలో కీలక పాత్రవహించిన ప్రతి ఒక్కరినీ శాలువా కప్పి, పూల గుచ్చం అందచేసి డీ.జీ.పీ స్వయంగా అభినందించారు. నేడు సాయంత్రం డీజీపీ కార్యాలయంలో రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ సుధీర్ బాబు, యాదాద్రి డీ.సీ.పీ నారాయణ రెడ్డి, ఎస్.ఓ.టీ అడిషనల్ డీ.సి.పీ ఎస్.సురేందర్ రెడ్డి, బోనగిరి డీసీపీ భుజంగ రావ్,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.చంద్ర శేఖర్, ఐ.టీ. సెల్ల్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీధర్ రెడ్డి, బోనగిరి రూరల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి,బొమ్మలరామారం ఎస్.ఐ. ఎల్.మధు బాబు, కోర్ట్ ద్యూటీ ఆఫీసర్ పీ.సి.చంద్రయ్య లు డీజీపీ మహేందర్ రెడ్డి ని కలిశారు.ఈ సందర్బంగా హాజిపూర్ సంఘటన, విచారణ క్రమం, మొత్తం క్రయిం ను శాస్త్రీయ పద్దతిలో ఎవిడెన్స్ రూపొందించిన విధానం, స్థానికుల సహకారం తదితర విషయాలను డీ.జీ.పీ అడిగి తెలుసుకున్నారు. 2015 నుండి హాజీపూర్ లో జరిగిన మిస్సింగ్ కేసులతో పాటు ఇతర కేసులన్నింటినీ తగు ఆధారాలతో ఛేదించిన క్రమాన్ని సి.పీ భగవత్ వివరించారు. హాజీపూర్ నిందితుడు ఏఏ ఇతర నగరాలు, రాష్ట్రాలకు వెళ్ళాడో ఆవివరాలను కూడా ఆయా ఎస్పీ లకు అందచేశామని, ఆ సమయం లో అక్కడ ఏమైనా నేరాలకు పాల్పడ్డాడా అన్న విషయాలను కూడా విచారించామని పేర్కొన్నారు. మొత్తానికి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ కేసు విషయంలో నిందితుడికి శిక్ష విధించడంలో సమర్థవంతంగా వ్యహారించిన సీఏపీ మహేష్ భగవత్ తో పాటు ఆయన బృందాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్బంగా నగదు పురస్కారాన్ని కూడా డీజీపీ అందచేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post