వరంగల్‌లో మరో సంస్థ ఏర్పాటు కానుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘వరంగల్‌లో ఫిబ్రవరి 16న క్వాడ్రంట్ రిసోర్స్ సంస్థ తమ ఐటీ కేంద్రానికి శంకుస్థాపన జరుగుతుంది. ఈ క్వాడ్రంట్ రిసోర్స్ కేంద్రం 1.5 ఎకరాల్లో ఏర్పాటు కానుంది.. దీని ద్వారా 500 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కనున్నాయి. క్వాడ్రంట్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎన్‌ఆర్‌ఐ వంశీరెడ్డికి ధన్యవాదాలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, మడికొండలోని ఐటీ పార్కులో క్వాడ్రంట్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ తన బ్రాంచిని ఏర్పాటు చేయనుంది. శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు కంపెనీ సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి ఇప్పటికే తెలిపారు.
Post a Comment